దివ్యాంగుల ను చిన్నచూపు చూడవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 114 మంది దివ్యాంగులకు 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన స్కూటీలు, బ్యాటరీ ట్రై సైకిల్స్, లాప్టాప్, స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఉపకరణాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దివ్యాంగుల శ్రేయస్సు కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. గతం ప్రభుత్వాల హయాంలో 500 రూపాయల పింఛను వుండగా 3016 రూపాయలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ కుమార్, చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి, జెడ్పిటిసి రామ్మూర్తి తో పాటు ప్రజా నిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..