పలు కేసుల్లో తిహాడ్ జైలులో శిక్ష అనుబవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ తనను కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. విచారణ కోసం తనను పోలీసులకు అప్పగించవద్దు అని పటియాలా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే పోలీసులు తనను నకిలీ ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందన్నాడు. గోల్డీ ఆరోపణలను ఖండిస్తూ ఇంతటి భారీ హత్యకు కుట్రను జైలులో నుంచి ఎలా ప్లాన్ చేస్తారని లారెన్స్ తరపున పిటిషన్ వేసిన న్యాయవాది ప్రశ్నించారు. లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు. బిష్ణోయ్ కి గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. వీరు పంజాబ్ లో వసూళ్ల దందా నడుపుతూ ఉండేవారు. దేశరాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో లారెన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. కాగా పలు కేసుల్లో లారెన్స్ అరెస్ట్ అయ్యి తీహాడ్ జైల్లో ఉన్నాడు. అనంతరం కెనడాకు పారిపోయిన గోల్డీ బ్రార్ అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ గొడవలు, హత్యల కారణంగానే తాజాగా ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలాను తామే హతమార్చామని కెనడాకు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ ముఠా వెల్లడించింది. వాంటెడ్ క్రిమినల్ గోల్డీబ్రార్ ఈ హత్య చేశానని ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అకాలీదళ్ నేత హత్య విచారణలో ఈ సింగర్ సిద్దూ మూస్ వాలా పేరు వచ్చిందని.. కానీ పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోల్డీబ్రార్ పేరిట ప్రచారం అవుతున్న ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే వాదనలు వచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement