హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 1,941కు చేరింది. గత శనివారం వచ్చిన ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు తొలగించిన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. మరో 7వేల మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో 84 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం ధాటికి రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లటం ఇబ్బందిగా మారింది.
హైతీలో గత శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం.. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో శనివారం తెల్లవారు జామున భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండిః బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్