Tuesday, November 26, 2024

హైతీ భూకంపం: 1,297కు చేరిన మృతుల సంఖ్య

హైతీలో భారీ భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 1,297కు పెరిగింది. 2,800 మంది గాయపడ్డారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. మనుముందు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. శనివారం రోజంతా ప్రకంపనలు వణికించగా, నిన్న తెల్లవారుజామున కూడా భూమి ఆరుసార్లు కంపించింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా వీధుల్లోనే గడిపారు. తీరప్రాంత పట్టణమైన లెస్‌కేయస్‌ తీవ్రంగా దెబ్బతింది. క్షతగాత్రులను ఇక్కడి నుంచి రాజధానికి తరలించేందుకు మాజీ సెనేటర్ ఒకరు ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని పోగొట్టుకున్న వారి రోదనలతో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.

భూకంపం ధాటికి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం పెను విలయాన్నే సృష్టించింది. కాగా, 2010లో ఇక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: మగధీర-బాహుబలి కాంబినేషన్లో భారీ మూవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement