Friday, November 22, 2024

US: మార్చి1 నుంచి అమెరికా వీసా అప్లికేషన్లు.. ఆన్​లైన్​లో దరఖాస్తుకి చాన్స్​

H-1B వీసా కోసం మార్చి 1నుంచి రిజిస్ట్రేషన్‌లు తీసుకోనున్నట్టు యూఎస్ ఎంబసీ, యూఎస్​​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​ అధికారులు తెలిపారు. మార్చి 18 వరకు ఈ రిజిస్ట్రేషన్లకు వెబ్​సైట్​ ఓపెన్​ చేసి ఉంచుతామని, ఈ మధ్య కాలంలో పిటిషనర్లు,  వారి ప్రతినిధులు ఆన్‌లైన్​లో H-1B వీసా రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేసుకోవాలని వెల్లడించారు.  “USCIS FY 2023 H-1B క్యాప్ కోసం సమర్పించిన ప్రతి రిజిస్ట్రేషన్‌కు నిర్ధారణ నంబర్‌ను కేటాయిస్తామన్నారు. ఈ నంబర్ కేవలం రిజిస్ట్రేషన్‌లను ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుందని ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​ తెలిపింది. అయితే ఆన్‌లైన్‌లో  కేస్​ స్టేటస్​ ట్రాక్ చేయడానికి ఈ నంబర్‌ను ఉపయోగించలేరని పేర్కొంది.

H-1B వీసా పిటిషనర్లు,  వారి ప్రతినిధులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో మాత్రమే రిజిస్ట్రార్​ చేసుకోవాలని, దీనికి myUSCIS ఆన్‌లైన్ అకౌంట్​ని ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.  అప్లై చేసిన ప్రతి రిజిస్ట్రేషన్ కోసం అనుబంధిత 10డాలర్ల  H-1B రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఫిబ్రవరి 21న మధ్యాహ్నం కొత్త ఖాతాలను అందజేయనున్నట్టు యూఎస్​ ఎంబసీ అధికారులు వెల్లడించారు.

కాగా, ఎప్పుడైనా తమ క్లయింట్‌లను తెలియజేయవచ్చని,.. అయితే లబ్ధిదారుల సమాచారాన్ని నమోదు చేయడానికి  10 అమెరికన్​ డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీని పరిష్కారానికి మార్చి 1 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని, అందుకని ఒకే ఆన్‌లైన్ సెషన్,  ఖాతా ద్వారా తుది చెల్లింపు,  ప్రతి రిజిస్ట్రేషన్‌ను సమర్పించే ముందు డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్‌లను రెడీగా ఉంచుకోవాలని అధికారులు వివరించారు.  

H-1B వీసా అనేది నాన్ -ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది US కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం,  చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం 10వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి పలు కంపెనీలు దీనిపై ఆధారపడి ఉంటాయి. ప్రతి సంవత్సరం US 65,000 కొత్త H-1B వీసాలను జారీ చేస్తోంది.  US మాస్టర్స్ డిగ్రీ హోల్డర్‌ల కోసం మరో 20,000  వీసాలను రిజర్వ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement