రెండోసారి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గెజిట్ విడుదల చేశారు. శాసనమండలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల 14న రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మండలి చైర్మన్‌గా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో.. గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు. 2019, సెప్టెంబర్ 11న తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021, జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో ప్రొటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అనంతరం మండలి ప్రొటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియామకం అయ్యారు. శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..