తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దూసుకుపోతోంది. ప్రతి రౌండ్‌లో మెజారిటీని పెంచుకుంటూ రెండు లక్షలకు పైగా ఆధిక్యం సాధించింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు అందిన ఫలితాల మేరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2.31 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 5,33,961 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,02,580 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 50,354 ఓట్లు పోలయ్యాయి. దీంతో 2019లో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సాధించిన 2.28 లక్షల మెజారిటీని గురుమూర్తి అధిగమించారు.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్‌లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది. కాగా కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది.