సంబేపల్లె ( అన్నమయ్య జిల్లా) : దేవపట్ల గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించింది. ఏడు నెలల గర్భం పూర్తయిన గుర్తించకపోవడంతో పాఠశాల యాజమాన్యం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికల పై నిరంతరం నిఘా పెట్టాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. చిన్నమండెం మండలానికి చెందిన ఓ విద్యార్థిని దేవపట్ల గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న తరుణంలో గర్భంతో ఉందని తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఏడో తరగతి బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. ఏడవ తరగతి విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణం ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ..అందులోనే వసతి గృహం ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటన ఎందుకు చోటు చేసుకుందో అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అందుకు గల కారణం ఎవరు అనే విషయం కనుక్కుని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దేవపట్ల గురుకుల పాఠశాలలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Big Breaking : గురుకుల పాఠశాలలో – ఏడవ తరగతి విద్యార్థిని ప్రసవం
Advertisement
తాజా వార్తలు
Advertisement