Friday, November 22, 2024

కుప్పకూలిన అపార్ట్​మెంట్.. ఒకరు మృతి.. శిథిలాలకిందపడి పలువురికి తీవ్ర గాయాలు​

ఒక రెసిడెన్షియల్ టవర్‌ కూలిపోయిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరొ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బిల్డిండ్ ​ కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేశారు అధికారులు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు పోలీసు అధికారులు..

హర్యానాలోని గురుగ్రామ్​లో నిన్న రాత్రి ఒక రెసిడెన్షియల్​ బిల్డింగ్ కుప్పకూలింది. ఆ భవన శిథిలాల కింద చిక్కుకుని ఓ మహిళ చనిపోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు చింటెల్స్ ప్యారడిసో బిల్డర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశామని, బిల్డర్​ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.

కాగా, బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.  సెక్టార్ 109లోని చింటెల్స్ ప్యారడిసో హౌసింగ్ కాంప్లెక్స్ లోని 6వ అంతస్థు అపార్ట్ మెంట్‌లోని డైనింగ్ రూమ్ ఫ్లోర్ మొదట పడిపోయిందని, మొదటి అంతస్తు వరకు నేరుగా పైకప్పు మొత్తం కుప్పకూలిందన్నారు అధికారులు.  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతురాలు ఏక్తా భరద్వాజ్ (31)గా గుర్తించారు. శిథిలాల కింద అరుణ్ కుమార్ శ్రీవాస్తవ, ఆయన భార్య సునీతా శ్రీవాస్తవ చిక్కుకున్నారని సీనియర్ అధికారి తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement