– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇవ్వాల జరిగిన ఆర్ ఎస్ ఎస్, బీజేపీ భేటీలో మునుగోడు ఎన్నిక గురించి కీలక చర్చ జరిగనట్టు తెలుస్తోంది. ఎట్లాగైనా ఈ ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో బీజేపీ ఉన్నట్టు సమాచారం. కాగా, టీఆర్ ఎస్ పార్టీ కూడా అంతకుమించి ఫోకస్ పెట్టబోతోంది. ఈ ఎన్నికలో గెలిచి ఉత్సాహంతో శ్రేణులను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గులాబీ దళపతి కేసీఆర్ ఉన్నారు. అందుకని అక్కడ పెద్ద ఎత్తున్న ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
దీనిలో భాగంగా ఇప్పటికే ఒక దఫా బహిరంగ సభ నిర్వహించి సీఎం కేసీఆర్ రేపు మునుగోడుకు 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలను వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక.. ఈ సీటు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండేది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఎన్నిక అనివార్యమయ్యింది. కాగా, తమ సీటును గెలుచుకుని స్థానికంగా ఉన్న బలం నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.