ఆస్కార్ రేసులో భారత్ నుంచి మరో మూవీని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఎంపికైందన్న వార్త బయటకు వచ్చింది. గుజరాతీ మూవీ అయిన ఛెల్లో షో ఎంపికైనట్లుగా ప్రకటించారు. అస్కార్ రేసులో నిలిచిన గుజరాతీ ఫిలిం గురించి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భవిన్ రాబరి.. భవేష్ శ్రీమాలి.. రిచా మీనా తదితరులు నటించారు. ఈ చిత్ర దర్శకుడు నలిన్ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ మూవీని తీయటంగా చెప్పాలి. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. విమర్శకుల మెప్పు పొందింది. ఈ చిత్రాన్ని అస్కార్ కు ఎంపిక చేసినందుకు చిత్ర టీం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తానిప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని.. సినిమా అనేది వినోదాన్ని.. స్ఫూర్తిని.. నాలెడ్జ్ ను అందిస్తుందని నమ్ముతున్నట్లుగా చిత్ర దర్శకుడు ట్వీట్ చేయటం గమనార్హం. దేవుడి దయవల్ల తమ చిత్రానికి ఆస్కార్ వస్తే అంతకుమించిన ఆనందం మరోకటి లేదని తెలిపాడు.
ఆస్కార్ రేసులో గుజరాతీ చిత్రం-తానిప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని ట్వీట్
Advertisement
తాజా వార్తలు
Advertisement