ఐపీఎల్ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. తొలుత పది ఓవర్లలోపు పించ్ హిట్టర్ శుభ్‌మన్ గిల్ (39) పరుగుల వద్ద పెవిలిచన్ పంపిన చెన్నై బౌలర్లు.. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా (54)ని కూడా నిలువరించారు. అయితే.. థర్డ్ వికెట్‌గా వచ్చిన సాయి సుదర్శన్ (96) ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గుజరాత్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. నిర్ణీత ఓవర్లలో గుజరాత్ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేయగలిగింది. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ ముందు 215 పరుగుల టార్గెట్ ఉంది. టార్గెట్ చేజింగ్ కోసం మరికొద్ది సేపట్లో ధోనీ సేన బ్యాటింగ్‌కు దిగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement