గుజరాత్ రాష్ట్రంలో చైల్డ్ ఫోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఆ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ కేంద్రంగా కొనసాగుతోన్న ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్‌ను జామ్‌నగర్ పోలీసులు ఛేధించారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. డీఎస్పీ జయవీర్ సింహ్ జలా తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు క్రాక్ చేసినట్టు చెప్పారు. ఓ వాట్సాప్ లింక్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు క్లిక్ చేయగా, ఈ ఘోరం వెలుగులోకి వచ్చిందన్నారు. దాని ఐపీ అడ్రస్ ద్వారా మరింత ఎంక్వైరీ చేస్తే.. ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన జాడ తెలిసిందన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కేంద్రంగా ఈ దందా కొనసాగుతోన్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు.
ఇక.. చైల్డ్ పోర్నగ్రఫీకి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న కిషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 600 ఫొటోలు, 224 వీడియోలను అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్కులో ఉన్న మరో 1600 వీడియో క్లిప్స్‌ను డిలీట్ చేశారు. అతని పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో రష్యా, ఫ్రాన్స్‌కు చెందిన దేశాల వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ పిల్లల ఫొటోలను ఎక్కడ్నుంచి తీసుకున్నారనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.