Tuesday, October 22, 2024

గుజరాత్​ ప్రభుత్వానికి షాక్​​.. మోర్బీ ఘటనను సుమోటాగా విచారణకు చేపట్టిన హైకోర్టు

గుజరాత్​ రాష్ట్రంలోని మచ్చు నదిపై ఉన్న మోర్బీ కేబుల్​ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై హైకోర్టు సీరియస్​ అయ్యింది. అక్టోబర్​ 30వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఇవ్వాల (సోమవారం) హైకోర్టు దీన్ని సుమోటాగా విచారణకు స్వీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీజులు జారీ చేసింది. నవంబర్​ 14వ తేదీ లోపు దీనిపై స్టేటస్​ రిపోర్ట్​ అందజేయాలని కోరింది.  

తాము మోర్బీ ఘటనను సుమోటాగా విచారణకు తీసుకుంటున్నామని గుజరాత్​ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రితో కూడిన డివిజన్ బెంచ్ అడ్వకేట్ జనరల్‌ను ఉద్దేశించి చెప్పింది.  వార్తాపత్రికల కథనం ఆధారంగా బెంచ్ ఈ సంఘటనను పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ, మునిసిపాలిటీల కమిషనర్, మోర్బీ మున్సిపాలిటీ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

నవంబర్ 14న ఈ అంశాన్ని విచారణ జరపనున్నట్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకునేలా చూడాలని, వచ్చే సోమవారం నాటికి స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.  ఈ వ్యవహారంపై నవంబర్ 14లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కూడా కోర్టు ఆదేశించింది. ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఏడు నెలల మరమ్మతుల తర్వాత మోర్బీ వంతెనను అక్టోబర్ 26న ప్రజల సందర్శన కోసం రీ ఓపెన్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement