Friday, November 22, 2024

అక్కడ జూన్ 7 వరకు లాక్ డౌన్.. కానీ భారీగా సడలింపు!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వైరస్ తో విలవిలాడిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోను కరోనా కేసులు భారీగా తగ్గాయి. దీంతో రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఆన్ లాక్ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. కరోనా ఉద్ధృతి త‌గ్గ‌డంతో కొవిడ్-19 నియంత్ర‌ణ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజ‌రుతో అన్ని కార్యాల‌యాల‌ను తెరిచేందుకు అనుమ‌తించింది.

గుజరాత్ లోని 36 న‌గ‌రాల్లో అన్ని షాపుల‌ను ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ తెరిచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం  అనుమ‌తించింది. రెస్టారెంట్ల, హోం డెలివ‌రీ సేవ‌ల‌ను రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ తెరిచే ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ నియంత్ర‌ణ‌లు జూన్ 11 వర‌కూ కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. రాత్రి క‌ర్ఫ్యూ జూన్ 11 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు వెల్లడించింది.

మ‌రోవైపు గుజ‌రాత్ లో 1207 తాజా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఒక్క‌రోజులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,13,270 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ తో 9,890 మంది మరణించారు. కాగా ప్రస్తుతం గుజరాత్‌లో 24,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement