ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ (ఆప్) ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం బీజేపీ కోటలో పాగా వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారంలోకి రావడమే వన్ పాయింట్ ఎజెండాగా రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇక.. ఇవ్వాల (సోమవారం) పర్యటనలో కేజ్రీవాల్‌కు అక్కడి ఆటోవాలా నుంచి ఓ ఆహ్వానం అందింది.
‘‘”నేను మీకు వీరాభిమానిని. పంజాబ్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు డిన్నర్ చేస్తున్న వీడియో చూశాను. నా ఇంటికి కూడా డిన్నర్‌కి వస్తారా?” అని కేజ్రీవాల్‌ను ఆటో డ్రైవర్ విక్రమ్ లల్తానీ అడిగారు. దీనికి స్పందించిన సీఎం కేజ్రీవాల్ “జరూర్ అయేంగే (నేను తప్పకుండా వస్తాను)” అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా.. “మీరు నన్ను మీ ఆటోలో నన్ను పికప్ చేసుకుంటారా?” అని కేజ్రీవాల్ అనగానే అక్కడున్న ఆటోడ్రైవర్లంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఆటోడ్రైవర్ లల్తాని సంతోషంగా తల వూపాడు.
ఈ ఏడాది కీలకమైన రాష్ట్ర ఎన్నికలకు ముందు గుజరాత్‌లో అడుగుపెట్టాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వాల అహ్మదాబాద్‌లో ఆటో రిక్షా డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు. కాగా, కేజ్రీవాల్ ఇంతకుముందు పర్యటలో తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భత్యం, నాణ్యమైన వైద్యం, ఉచిత విద్య వంటి వాటిని హామీలను ఇచ్చారు.