Thursday, November 21, 2024

వాట‌ర్ బాటిల్ రూ. 44ల‌క్ష‌లు – స్పెష‌ల్ ఏంటో తెలుసా

డ‌బ్బుంటే ల‌గ్జ‌రీ లైఫ్ దానంత‌ట అదే వ‌స్తుంది. అన్నింటికీ మూల కార‌ణం డ‌బ్బే. ఇప్ప‌టికే సినీ సెల‌బ్రిటీలు వాడే వాట‌ర్ బాటిల్ ఖ‌రీదు వినే అమ్మో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ వాట‌ర్ బాటిల్ రేట్ వింటే క‌ళ్ళు బైర్లు క‌మ్మాల్సిందే.
ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. వసంతకాలంలో ఫిజి, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి సేకరించే నీరు ఇది. ఈ నీటిలో 5 గ్రాముల, 23 క్యారెట్ బంగారాన్ని కూడా కలుపుతారు. ఇది నీళ్లలోనే సెలెబ్రిటీ వాటర్. ఎందుకంటే వాట‌ర్ బాటిల్ ధ‌ర అక్ష‌రాలా రూ.44ల‌క్ష‌లు. ఈ బాటిల్ పేరు ఆక్వా డి క్రిస్ట‌ల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని. ఈ బాటిల్ లో 750ఎం ఎల్ వాట‌ర్ మాత్ర‌మే ప‌డుతుంది. మ‌రి వాట‌ర్ తాగేసి బాటిల్ ప‌డేద్దామ‌నుకుంటున్నారా. ఛాన్సే లేదు .. ఎందుకంటే ఆ బాటిల్ బంగారంతో చేసిన‌ది కాబ‌ట్టి.

అంతేకాదండోయ్ ఈ బాటిల్ అతి ఖ‌రీదైన‌దిగా 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. మళ్లీ ఇది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, చైర్‌పర్సన్ అయినా నీతా అంబానీ క్రికెట్ స్టేడియంలో బంగారు నీళ్ల బాటిల్ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నీతా ఇంత ఖరీదైన నీళ్లు తాగుతారా అంటూ నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు. అయితే అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. నీతా అంబానీ చేతిలో ఆ బాటిల్ పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఈ నీళ్లు, బాటిల్ ఎందుకంత ఖరీదు అని అనుకుంటున్నారా.. ఆ బాటిల్ ను 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ బాటిల్ డిజైన్ చేసింది కూడా సెలెబ్రెటీ బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో. దీన్ని ఒకటో లేదా రెండో తయారుచేశారు. వాటిని వేలం వేసి మరీ అమ్మారు. తొలిసారి అమ్మినప్పుడు నలభై నాలుగు లక్షల రూపాయలకు కొనుక్కున్నారు. ఆర్డర్ మీద మాత్రమే వీటిని తయారుచేస్తుంటారు. మెక్సికో సిటీలో వీటి వేలం జరుగుతుంటుంది. ఈ వేలంలో వచ్చిన డబ్బులను గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడేందుకు పాటుపడే సంస్థలకు అందిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement