కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతూ.. నకిలీ బిల్స్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు కన్నేశారు. ఇదే తరహాలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున బోగస్ బిల్లులతో దాదాపు 20 కోట్ల ఇన్పుట్స్ క్రెడిట్స్‌ని పొందినట్టు తెలుసుకుని రైడ్స్ జరిపారు. మాహారాష్ట్ర ముంబైలోని భివాండిలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సిజిఎస్టి) కమిషనరేట్‌లోని ఓ బృందం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) రాకెట్‌ను ఛేదించి ఓ వ్యాపారిని అరెస్టు చేసింది. కాగా, విచారణలో వ్యాపారవేత్త ఫార్మా కెమ్, నియాన్ ఫార్మా కెమ్ అనే రెండు సంస్థలను ప్రారంభించాడు. దాని ద్వారా అతను రూ.20.44 కోట్ల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందాడు. అంతేకాకుండా మొత్తం విలువ రూ. 32.5 కోట్ల విలువైన వస్తువుల పేరిట నకిలీ ఐటీసీని తప్పుగా వినియోగించుకోవడం ద్వారా రూ.5.74 కోట్ల జీఎస్టీ ఎగవేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
CGST యొక్క పన్ను -ఎగవేత విభాగానికి అందిన సమాచారం ఆధారంగా బోగస్ బిల్లింగ్, నకిలీ ఐటీసీని పాస్ చేయడం.. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా లాస్ తెస్తున్న నిందితుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. కావాలనే సంస్ను రిజిస్ట్రర్ చేసి మోసం చేస్తున్నట్టు గుర్తించారు. ఉనికిలో లేని సరఫరాదారుల నుండి ఎలాంటి రశీదు లేకుండా రూ. 5.74కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్టు కనిపెట్టారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ ఆరు నెలల్లో భివాండీ కమిషనరేట్‌లో ఇది ఏడో కేసుకు అధికారులు తెలిపారు. నకిలీ ITC నెట్వర్క్ లు, ఇతర GST ఎగవేతదారులపై రాబోయే రోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టునున్నట్టు అధికారులు తెలిపారు.