హైదరాబాద్ ఆంధ్రప్రభ : అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ వారం, పది రోజుల్లో వెలువడనుంది. ఉగాది తర్వాత నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తున్నది. 19 శాఖల్లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ సమావేశమై సంబంధిత వివరాలను సేకరించారు. అదేవిధంగా ఓటీఆర్‌లో సవరణలు చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. గతంలో 10 జిల్లాలు, రెండు జోన్‌లు మరియు ఒక మల్టిd జోన్ ఉండేది.
కానీ ప్రస్తుతం 33 జిల్లాలు, 7 జోన్‌లు, 2 మల్టిdజోన్‌లుగా నియమించబడింది. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వు 2018 ప్రకారం అభ్యర్థుల స్థానిక అభ్యర్థిత్వం కూడా నిర్ణయించడింది. దీని ప్రకారం ఓటీఆర్ ఫారమ్‌లో కొన్ని సవరణలకు అవకాశం కల్పిస్తున్నారు. కమిషన్ వెబ్‌సైట్‌లో ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఓటీఆర్ ఫారమ్‌ను టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ కావాలని సూచించింది. ఓటీఆర్‌లోని కాలమ్‌లను అప్‌డేట్ చేసుకునేలా మార్పులు చేసినట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...