న్యూఢిల్లి : భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పూర్తయ్యాయి. ఢిల్లిd కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్ స్కేర్ శ్మశాన వాటికలో రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌కు అశ్రు నయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుమార్తెలు కీర్తిక, తరిణిలు తమ తల్లిదండ్రుల చితికి నిప్పుపెట్టారు. విదేశీ సైనిక అధికారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు, కుటుంబ సభ్యుల మధ్య సైనిక లాంఛనాలతో రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల భౌతికకాయాలపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని వారి కుమార్తెలకు అందజేశారు. 17 గన్ సెల్యూట్‌తో ఘనంగా భారత్ సైన్యం నివాళులర్పించింది. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది సైనిక అధికారులు, 33 మందితో కూడిన ట్రై సరీస్ బ్యాండ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800 మంది సేవా సిబ్బంది అంత్యక్రియల్లో భాగస్వాములయ్యారు.
రావత్ అమర్ రహే నినాదాలు..
మధ్యాహ్నం 2 గంటలకు రావత్ దంపతుల అంతిమ యాత్ర ప్రారంభమైంది. సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అంతిమ యాత్ర వెంట అడుగులో అడుగు వేస్తూ.. రావత్ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు. భారత్ మాతాకీ జై.. రావత్ అమర్ రహే.. అనే నినాదాలతో హస్తిన హోరెత్తింది. రెండు గంటల పాటు కొనసాగిన అంతిమ యాత్రలో దేశ సేవకుడు కడసారి చూపు కోసం వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. శ్రీలంక సీడీఎస్ అండ్ కమాండర్ జనరల్ షవేంద్ర సిల్వా, శ్రీలంక మాజీ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి (నేషనల్ డిఫెన్స్ కాలేజీలో రావత్‌కు మంచి స్నేహితుడు), రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ డోర్జీ రించన్, నేపాల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాలకృష్ణ కార్కీ, బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌తో పాటు పలు దేశాల రాయబారులు హాజరై.. రావత్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు.
కామరాజ్ మార్గ్ నుంచి అంతిమ యాత్ర
దీనికి ముందు ప్రజల సందర్శన కోసం రావత్ దంపతుల పార్థివ దేహాలను ఢిల్లిdలోని కామరాజ్ మార్గ్ నివాసంలో ఉంచారు. అక్కడి నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లిd లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లిd సీఎం అరవింద్ కేజ్రీవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరీలు కూడా హాజరయ్యారు.
భూటాన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు
రావత్ దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. భూటాన్ రాజు జిగ్మే కెసర్ నామగ్యాల్ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తండ్రి గ్యాల్పో కూడా పాల్గొన్నారు. ప్రార్థనలకు సంబంధించిన ఫొటోలను భారత్ దౌత్య కార్యాలయం పోస్టు చేసింది. జనరల్ రావత్ భూటాన్‌ను పలుమార్లు సందర్శించారని, ఆయన్ను ఒక మిత్రుడిగా భూటాన్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని రాజు జిగ్మే కెసర్ నామగ్యాల్ తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. 2017లో డోక్లాం ట్రైజంక్షన్ సమయంలో భూటాన్‌కు రావత్ అండగా నిలవడాన్ని గుర్తు చేసుకున్నారు. చైనా ఆక్రమణ వ్యూహాన్ని తిప్పి కొట్టడంలో రావత్ కీలక పాత్ర పోషించారు. బిపిన్ రావత్ ఆ సమయంలో భారత్ సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచి భూటాన్‌కు, రావత్‌కు ఎంతో దగ్గరి సంబంధం ఉంది. ఆర్మీ చీఫ్ హోదాలో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, కజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్, శ్రీలంక, రష్యా, వియత్నాం, టాంజానియా, కెన్యా, అమెరికా, మాల్దిdవులను సందర్శించారు.
బ్రిగేడియర్ లిద్దర్ అంత్యక్రియలు పూర్తి
రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఆయన సలహాదారు బ్రిగేడియర్ ఎల్ఎస్. ఢిల్లిd కాంట్‌లోని బ్రార్ స్కేర్‌లో లిద్దర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో లిద్దర్ భార్య అతని శవపేటికను ముద్దుపెట్టుకుని పదేపదే కన్నీరుమున్నీరైంది. లిద్దర్ కుమార్తె తన ధైర్యవంతుడౖౖెన తండ్రికి నిప్పు పెట్టింది. నా జీవితమంతా కోల్పోయాను.. కానీ నేను సైనికుడి భార్యను.. వారికి నవుతూ మంచి వీడ్కోలు పలకాలి.. జీవితం చాలా పెద్దది.. ఇప్పుడు దేవుడు అనుమతిస్తే.. మేం దాంతో జీవిస్తాం.. ఆయన చాలా మంచి తండ్రి.. కూతురు ఆయన్ను చాలా మిస్ అవుతుంది అని బ్రిగేడియర్ లిద్దర్ భార్య గీతిక చెప్పుకొచ్చారు. తరువాత ఆమె లిద్దర్ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచింది. లిద్దర్ మృతదేహాన్ని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచి శంకర్ విహార్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఆ తరువాత బ్రార్ స్క్వేర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.