ప్రభ న్యూస్, ప్రతినిధి, భూపాలపల్లి : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వారు విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా భూపాలపల్లి మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ ముందు రూ.36.5 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆక్యు ప్రెజర్ పార్క్ ను మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక శాససభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటున్న ఐడిఓసి నిర్మాణ పనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరి దశ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్&బి అధికారులను ఆదేశించారు.
- పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
ఫారెస్ట్ డిపార్ట మెంట్ వారిచే ఏర్పాటు చేసిన. ప్రో. జయశంకర్ అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటి ఫారెస్ట్ శాఖా వారు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. హరిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో బృహొత్తర కార్యక్రమం చేపట్టారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది విడతల్లో 273 కోట్ల మొక్కలు పెట్టామన్నారు. హరితోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ సురేందర్ రెడ్డి, డి ఎఫ్ఓ లావణ్య, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రాణి సిద్దు, జెడ్పి వైస్ ఛైర్పెర్సన్ కె.శోభ, మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రమేష్ గౌడ్, పి.డి.డి.ఆర్.డి.ఓ, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, జెడ్పిటిసిలు, ఎం.పి.పి.లు సర్పంచులు, ప్రజా ప్రజాప్రతినిధులు, అటవీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.