నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తర్ణలో కోల్పోతున్న యాభై ఏళ్ళ వయస్సును పెద్ద పెద్ద చెట్లకు పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు. రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి తదితరులు ఈ బ్రుహత్తర కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని యస్పీ బంగ్లా ముందు ఉన్న యాభై ఏళ్ళ వయస్సు గల వేప, చింత, రాగి,మర్రి చెట్లను వేర్లతో సహ పెకిలించి.. పెద్ద క్రేన్ ల సాయంతో పెద్ద ట్రక్కులలో చెట్లను తరలించారు. నల్లగొండ బైపాస్ లోని చర్లపల్లి అర్భన్ పార్క్ లో ఈ చెట్లను తిరిగి నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్దతో, ఈ చెట్లు మోడు వారకుండా సైంటిఫిక్ పద్దతుల్ని అనుసరించి చెట్లు తిరిగి జీవం పోసుకోని, చిగురించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 12 చెట్లను ట్రాన్స్ లొకేషన్ చేశారు. అందులో 11 వేప చెట్లు కాగా, మరొకటి చింత చెట్టు అని నిర్వాహకులు తెలిపారు. రోడ్ల వెడల్పు వల్ల నల్లగొండ పట్టణంలో మెత్తం 200 పైగా చెట్లు తొలగిస్తున్నామని వాటిని అన్నింటిని దశల వారిగా ఆగస్టు మాసం లోపు ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మెదటి ఫేజ్ లో 50 మెక్కల్ని ట్రాన్స్ లొకేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు.
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , వాటా ఫౌండేషన్ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సైంటిఫిక్ పద్దతితో యాభై ఏళ్ళ వయస్సున్న చెట్లకు తిరిగి ప్రాణం పోయడం నిజంగా అద్భుతమని భూపాల్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండయా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చరిత్రలో చిరస్దాయిగా నిల్చిపోతారని చెప్పారు. ఇప్పటికే జాతీయ,అంతర్జాతీయ స్దాయి అవార్డ్ లను సొంతం చేసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం.. ఈ ట్రాన్సో లోకేషన్ కార్యక్రమంతో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నదని ధీమా వ్యక్తం చేశారు.