ప్రముఖ ఆధ్యాత్మికవేత్త,ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతం శంకర్ పల్లిలోని మానసగంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కని నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ని కొనియాడారు.మొక్కలను నాటడమనే మహోన్నతమైన కార్యంకి శ్రీకారం చుట్టడం మంచి విషయమన్నారు. భవిష్యత్ తరాలకోసం చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాలనే ఆయన ఆలోచన అద్భుతమంటూ కొనియాడారు.
చెట్లలో రెండు రకాలు వుంటాయని… పండ్లు ఫలాలను ఇచ్చేవి కొన్నయితే ఏపుగా పెరిగి నీడనివ్వడం, ప్రజా అవసరాల కోసం ఉపయోగపడేవి మరికొన్ని వుంటాయన్నారు. ఈ రెండురకాలు మానవాళికి ఉపయోగపడేవే. అలాంటి ఉపయోగకరమైన మొక్కలను నాటాల్సిన అవసరం ఎంతయినా వుందన్నారు.ఈ సందర్భంగా వృక్షాలకు భారతీయ సంస్కృతిలో ఎంతటి ప్రాధాన్యత వుందో తెలియజేస్తూ వాటి గొప్పతనాన్ని తెలియజేసే ”వృక్షవేదం” పుస్తకం గురించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ రవిశంకర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు, మల్లికార్జున్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యులు రాఘవతో పాటు ఆశ్రమ బాధ్యులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..