ఇవ్వాల్టి నుంచి ఐదో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రోగ్రామ్ ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్‌లో టీఆర్ ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మొక్కలు నాటుతారు.
కాగా, సీఎం కేసీఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో 2018లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురు మొక్కలు నాటాల్సిందిగా చాలెంజ్ విసరటమే ఈ గ్రీన్ ఇండియా స్ఫూర్తి.
ప్రారంభించిన తక్కు టైమ్‌లోనే దేశవ్యాప్తంగా ఇది ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఒక్కతాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని నిపింది ఈ గ్రీనిండియా కార్యక్రమం. సంతోష్‌కుమార్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తోంది.