Tuesday, November 26, 2024

Green Growth: 2070నాటికి.. నెట్ జీరో సాధ్యమేనా?

న్యూఢిల్లీ: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, సహజవనరులను కాపాడుకుంటూ అభివృద్ధి సాధించేందుకు ఉద్దేశించి భారత్ 2070 నాటికి గ్రీన్ గ్రోత్ లక్ష్యాన్ని పెట్టుకుంది. 2050 నాటికి ఆ లక్ష్యాన్ని సాధించాలని ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు బావిస్తుండగా భారత్ మాత్రం 2070 నాటికి గ్రీన్ గ్రోత్ సాధిస్తామని ప్రకటించింది. అయితే, దేశ ప్రజల్లో 54 శాతం మంది ప్రకృతి వనరులు, అడవులు ఆధారంగా జీవిస్తున్న మనదేశంలో గ్రీన్ గ్రోత్ సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పైగా రేపోమాపో 5 ట్రిలియన్ల్ ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చబోతున్న భారత్ శరవేగంగా ఎదుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అగ్రభాగాన ఉండాలని తహతహలాడుతోంది.

అభివృద్ధి అంటేనే పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన వంటి పరిణామాలు తప్పదు. ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే. అయితే కర్బన ఉద్గారాలను కనీసపక్షం చేస్తూ అభివృద్ధి సాధించడమే ఈ నెట్ జీరో లక్ష్యం. అందుకు భారత్ మరో 50 ఏళ్ల గడువు పెట్టుకుంది. ఆచరణలో ఇది సాధ్యమేనా అన్నవిషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.వాస్తవ పరిస్థితులకు ప్రతికూలదిశలో భారత్ వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సగటు స్థూలజాతీయోత్పత్తి 1901 డాలర్లుగా ఉన్న భారత్, మానవ అభివృద్ధి సూచికలో 131వ స్థానంలో(181 దేశాలకుగాను) ఉంది.

సాంకేతికంగా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికస్థోమత, సాంకేతిక సమర్థత పెంచుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న స్థితిలో పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడం అంత సులువు కాదు. భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితే ఇలా ఉంటే, ఇక అభివృద్ధి చెందని దేసాల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నెట్ జీరో, గ్రీన్ గ్రోత్ అంశాలపై చర్చించిన దేశాలు, వాస్తవానికి ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల గురించి అసలు ఆలోచించలేదు. ప్రకృతి సహజంగా అందే వనరుల ద్వారా ఆదివాసీలు, గిరిజనులు, ఎన్నో జాతులు జీవిస్తున్నాయి. నిజానికి వారివల్ల ప్రకృితి ఎటుంటి హానీ జరగడం లేదు.

ఎటొచ్చీ అభివృద్ధి కోసం చేపడుతున్న అత్యాధునిక సాంకేతికత, విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన కోసం అడవుల నరికివేత వంటివాటివల్లే సమస్య ఎదురవుతోంది. అయినప్పటికీ అభివృద్ధిలో అదొక పార్శ్వం. అంతమాత్రాన అభివృద్ధిని విస్మరించలేం. 2070 నాటికి నెట్ జీరో-గ్రీన్ గ్రోత్ సాధించే దిశగా అడుగులు వేయాల్సిందే. అందుకోసం ప్రకృతిని దెబ్బతీయకుండా, కర్బన ఉద్గారాలను కనీసపక్షం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. పర్యావరణహిత విధానాలను అనుసరించాలి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా దూసుకుపోతున్న భారత్ పచ్చగా కళకళలాడాలంటే ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజల మద్దతు అవసరం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement