Tuesday, November 19, 2024

Green Apple: తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు..

తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అందిస్తున్న గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, దుర్గం చెరువు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం లభించింది. భారత్‌కు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు రావడం ఇదే ప్రప్రథమమని ఈ సందర్భంగా గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది.

బ్యూటిఫుల్‌ వర్క్‌స్పేస్‌ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయానికి, హెరిటేజ్‌ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్‌కు, యూనిక్‌ డిజైన్‌ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జికి, స్పెషల్‌ ఆఫీస్‌ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు వచ్చాయి. ఈనెల 16న లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ ఈ అవార్డులను అందుకోనున్నారు. అయితే తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement