ఏటూరు నాగరంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించాలని ములుగు జిల్లాకు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్. జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ జగదీష్ హాజరై మాట్లాడారు..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో
మన ఊరు- మన బడి పక్క ప్రణాలికను రూపొందించి మంచి విద్యను అందించాలి అన్నారు. టీఎస్ ఎమ్మెస్ప్ స్కూల్ జవహర్ నగర్,జడ్పీ హై స్కూల్ ఏటూరునాగారం, మంగపేట మండలంలో కమలాపురం, నుగూరు వెంకటపురం నాలుగు స్కూళ్లలో 21-03-2022 నుండి 11-04-2022 వరకు ఎస్ జి టి శిక్షణ తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.
ఎస్ జి తరగతులకు ములుగు బాలికల కళశాల,టీస్ ఎమ్మెస్ బండారు పల్లి శిక్షణ ఇవ్వనున్నారు.రాబోయే విద్య సం.రంలో జిల్లాలో 1 నుండి 8 వ తరగతి వరకు ఆంగ్ల బోధన తరగతులు ప్రారంభ అవుతాయి అని అధికారులు తెలపగా మెరుగైన విద్య అందించడానికి చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ములుగు జిల్లాకు మెడికల్ కాలేజ్ .. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంజూరు చేసినందుకు ములుగు జిల్లా ప్రజల పక్షాన స్టాండింగ్ కమిటీ తరుపున కేసీఆర్ గారికి,హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపుతూ తీర్మానం చేశారు.
మెడికల్ కాలేజీ,హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు మంజూరు చేసిన – సీఎంకి ధన్యవాదాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement