Tuesday, November 12, 2024

వెయ్యి ఏళ్ళ నాటి ఆల‌యం..ఇప్ప‌టి చెక్కు చెద‌ర‌లేదు..ఎందుకో తెలుసా..

వెయ్యి సంవ‌త్స‌రాల నాటి ఆల‌యం..వంపులు తిరిగిన రంధ్రాలు..వీడ‌ని మిస్ట‌రీ..ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ క‌థేంటో చూద్దాం..అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది. తంజావూరులో మొత్తం 74 దేవాలయాల్లో అత్యద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం. గ్రానైట్ తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు, నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు, గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించారు..మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు.ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి.

తంజావూరు పర్యటనలో ఉన్న పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది. ఈ దేవాలయాన్ని వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వ దేవతల విగ్రహాలు ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇదొకటి..వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది..13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ వాడలేదు. నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే..భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది..

Advertisement

తాజా వార్తలు

Advertisement