శ్వేత గ్రానైట్, శ్వేత ఏజెన్సీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్… PSR గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్స్లో రెండురోజులు సోదాలు జరిపిన ఈడీ కీలక ఆధారాలు లభించినట్టు ఇవ్వాల (శుక్రవారం) వివరాలు వెల్లడించింది. గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. ఫెమా చట్ట ఉల్లంఘన నేపథ్యంలోనే ఈ సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఈ సోదాల్లో రూ. 1.08 కోట్ల నగదు సీజ్ చేసినట్టు తెలిపారు.
గ్రానైట్ వ్యాపారులు బినామీ పేర్ల అకౌంట్లను కూడా గుర్తించామని, చైనాకు చెందిన లీ హువాన్‌తో ఒప్పందాలున్నట్టు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ అధికారులు తెలిపారు. పనామా లీక్స్ వ్యవహారంలో లీ హువాన్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సముద్ర, రైలు మార్గాల ద్వారా అక్రమ రవాణా ద్వారా.. ప్రభుత్వానికి రూ.750 కోట్ల గ్రానైట్ కంపెనీలు ఎగ్గొట్టినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ అధికారులు తెలిపారు.