తనని చిన్నప్పుడు పెంచిన నానమ్మని కలుసుకొనేందుకు 8800కిలో మీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు ఆమె జాడను తెలుసుకుని కలుసుకున్నాడు ఓ వ్యక్తి. 45ఏళ్ల తర్వాత ఆమెను కలిశాడు. ఎన్నో వ్యయ ప్రయాసలతో స్పెయిన్ నుంచి బొలీవియా వచ్చి చివరకు తన బామ్మ జాడను కనుక్కోగలిగాడు. తన ప్రయాణాన్ని మొత్తం రికార్డు చేసిన ఆ వ్యక్తి.. నానమ్మను కలిసి వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్లో వైరల్గా మారింది. నానమ్మను తిరిగి కలుసుకోవడం కోసం అతను పడ్డ శ్రమ, తపన.. తన కోసం వచ్చిన మనవడిని ఆప్యాయంగా హత్తుకున్న క్షణాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఈ వీడియోను గుడ్న్యూస్ మూవ్మెంట్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది. “45 సంవత్సరాల తర్వాత, ఈ వ్యక్తి తన బామ్మ అనాను కనుగొన్నాడు. చిన్నతనంలో అతడిని ఆమె తన సొంత కొడుకులా చూసుకున్న అపురూపమైన మహిళ’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. పసిబిడ్డగా ఉన్నప్పుడు బామ్మ చూపెట్టిన ప్రేమే అతడిని ఇంతదూరం తీసుకొచ్చింది అని కామెంట్స్ పెడుతున్నారు.
నాన్నమ్మని కలిసేందుకు 8,800కిలోమీటర్లు ప్రయాణించిన మనవడు-వైరల్ అవుతోన్న వీడియో
Advertisement
తాజా వార్తలు
Advertisement