Tuesday, November 19, 2024

Spl Story | తాత కల నెరవేరుస్తా.. ధోనీ నాకు ఆదర్శం అంటున్న నీట్​ టాపర్​ ఆర్నాబ్​

నీట్​ ఫలితాల్లో టాపర్​గా నిలిచిన పశ్చిమబెంగాల్​ వాసి ఆర్నాబ్ తన తాత కల నెరవేర్చేందుకే వైద్య విద్య చదవాలని అనుకున్నట్టు తెలిపాడు. ఇక.. ఈ పరీక్ష రాయడానికి తాను ఎంతో కష్టపడ్డానని, క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ తనకు ఆదర్శమని చెప్పాడు. అతని నుంచే తాను ఓర్పు, సహనం, ఒత్తిడిని జయించే విధానం నేర్చుకున్నట్టు తెలిపాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ​

నీట్​ ఫలితాలు వెలువడ్డాయి. మెడికల్ ఎంట్రన్స్ కోసం టాప్ 50 మెంబర్స్​ మెరిట్ జాబితాను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ( ఎన్​టీఏ) విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన విద్యార్థి అర్నాబ్ పతి NEETలో ఆల్ ఇండియా 19 ర్యాంక్ (AIR 19) సాధించాడు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన అర్నాబ్, తన తాత దివంగత చిత్తరంజన్ పతి తనను వైద్య వృత్తిలో చూడాలని ఆశపడ్డారని, అతని కోరిక మేరకు కష్టపడి చదివానని చెప్పాడు.  ‘‘2019లో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మా తాత చనిపోయాడు. నేను ఎప్పుడూ ఉన్నతమైన వృత్తిని చేపట్టాలని ఆయన కోరుకునే వారు. మా తాత కోరికను నిలబెట్టుకోవాలని నేను నిశ్చయించుకున్నా. మెడికల్ ఎంట్రన్స్ కోసం తీవ్రంగా కష్టపడ్డాను’’ అని అర్నాబ్ తెలిపాడు.

NEET UG 2023లో అర్నాబ్ 715 మార్కులు సాధించాడు. అతని పర్సంటైల్ 99.99. తన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అర్నాబ్ ఇలా అన్నాడు.. “కఠిన శ్రమ, ప్రిపరేషన్‌లో స్థిరత్వం, సహనం నీట్‌లో తన విజయానికి కీలకం” క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఒత్తిడిని, సహనాన్ని ఎదుర్కొనే కళను నేర్చుకున్నట్టు ఆర్నబ్​ చెప్పాడు.

- Advertisement -

ఇతను ఢిల్లీలోని AIIMS నుండి MBBS అభ్యసిస్తానని, భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ కావాలని కోరుకుంటున్నట్టు ఆర్నబ్​  మీడియాకు చెప్పాడు.  తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. వారి సపోర్ట్ లేకుండా నేను జీవితంలో విజయం సాధించలేను అని చెప్పాడు. అర్నాబ్ క్రికెట్ అభిమాని.. ఇక.. ప్రబంజన్ జె, బోరా వరుణ్ చక్రవర్త్ నీట్ యూజీలో 720 మార్కులతో 1 ర్యాంక్ సాధించారు. నీట్ యూజీ 2023 పరీక్షలో మొత్తం 11,45,976 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వగా, ఉత్తీర్ణత శాతం 56.21 శాతానికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement