Saturday, November 23, 2024

గ్రాడ్యుయేట్ చాయ్ వాలీకి -సాయమందించిన తేజ‌స్వియాద‌వ్..లాల్ ప్ర‌సాద్

ప్రియాంక గుప్తా..ఈ పేరు బాగా ఫేమ‌స్ అయింది.ఈమె ఓ గ్రాడ్యుయేట్.ఉద్యోగం రాక‌పోవ‌డంతో గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ పేరుతో టీస్టాల్ ని న‌డుపుతోంది. కాగా పాట్నాలో మున్సిపల్ అధికారులు తన టీస్టాల్ ను తొలగించడంతో సాయం కోసం ఆమె తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ను కలిసింది. వెంటనే స్పందించిన తేజస్వి ఆదేశాలతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తన స్టాల్ ను పునరుద్ధరించారని ప్రియాంక తెలిపింది. బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక కామర్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. అయితే నెలల తరబడి ప్రిపేర్ అవుతున్నా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో టీ అమ్మాలని నిర్ణయించుకుంది.

‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ పేరిట పాట్నా బోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ టీ స్టాల్ ఫేమస్ అయింది. లైగర్ హీరో విజయ్ దేవరకొండ, భోజ్‌పురి సినీ నటి అక్షర సింగ్ ఈ గుప్తా స్టాల్‌ని సందర్శించారు. రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రియాంకకు నోటీసులు ఇచ్చారు. స్టాల్ ను తొలగించవద్దని ఆమె అధికారులను వేడుకున్న వీడియో వైరల్ అయింది. నిబంధనల మేరకు డబ్బు డిపాజిట్ చేసి, తన దుకాణాన్ని తిరిగి తీసుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను అభ్యర్థించానని, అయిప్పటికీ తన స్టాల్ ను తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తనకు సాయం చేయాలని లాలూ, తేజస్వి యాదవ్ లను కోరింది. తర్వాతి రోజే తన టీస్టాల్ ను పురుద్ధరించడంతో ప్రియాంక సంతోషం వ్యక్తం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement