Saturday, November 23, 2024

గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరణ.. ‘మ్యాంగో’ ఆఫీసు ముట్టడి.. క్షమాపణ చెప్పిన రామ్​

సింగర్ సునీతను పెళ్లాడిన రామ్ కు మ్యాంగో యూ ట్యూబ్ చానల్ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చానల్ ఒక వివాదంలో చిక్కుకుంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని కించపరిచారనే ఆరోపణలతో  మ్యాంగో చానల్ కార్యాలయం వద్దకు గౌడ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గౌడ సంఘానికి చెందిన సుమారు 20 మంది.. రామ్ క్షమాపణలు చెప్పాలని.. మ్యాంగో డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే.. తమ సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని కించపరుస్తూ ప్రసారం చేస్తున్న వీడియోలను డిలీట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే.. పోలీసుల అండతో తమను అడ్డుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. ఇంతకూ.. ఈ వివాదం ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది? అన్న వివరాల్లోకి వెళితే.. గౌడ కులస్తులు.. గౌడ సంఘం నాయకులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ మధ్యన ‘‘నాలో నేను’’ అనే తెలుగు సినిమాలో కల్లు అమ్మే గౌడ మహిళను వేశ్యలా చూపించి.. తమ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా చూపించినట్లు ఆరోపించారు.

ఈ సినిమాకు దర్శకుడిగా పీఎన్ రెడ్డి ఉన్నారని.. నిర్మాతగా మదన్ అనే వ్యక్తి వ్యవహరించాడని.. తమ కులాన్ని అవమానించే విధంగా ప్రవర్తించారు కాబట్టి.. వారిపై ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో నటించిన వారి మీద కూడా చర్యలు తీసుకొని.. ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను మ్యాంగో యూ ట్యూబ్ చానల్ లో ప్రసారం చేస్తున్నారని.. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని కోరుతున్నారు. దీనిపై మ్యాంగో సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

బేషరతుగా క్షమాపణలు చెప్పిన మ్యాంగో మీడియా..

- Advertisement -

కాగా, ఈ వివాదానికి సంబంధించి మ్యాంగో మీడియా అధినేత రామ్​ గౌడ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపరచలేదని, తమ యూట్యూబ్​ చానల్​ ప్రసారం చేసే వీడియోలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement