Friday, November 22, 2024

ఫారెన్​ టూర్లపై ఆంక్షల్లేవ్​.. విమాన ప్రయాణాలకు కొవిడ్​ గైడ్​లైన్స్​ సవరించిన ఆరోగ్యశాఖ

అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సవరించిన కొవిడ్ -19 మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. కాగా, దీనిలో విదేశీ ప్రయాణికులకు పెద్ద ఊరట లభించిందనే చెప్పవచ్చు. ‘రిస్క్​ కంట్రీస్​’.. ఇతర వర్గీకరణల వంటి దేశాల విభజనను ఈసారి తొలిగించారు. దీని ప్రకారం పోర్ట్ ఆఫ్ అరైవల్‌లో నమూనాలను అందించడం, ‘రిస్క్ లో ఉన్న’ దేశాల నుండి ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే.. RT-PCR టెస్ట్​ రిపోర్టు తప్పకుండా ఉండాలి. (ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్నది) ప్రయాణికులు ప్రైమరీ టీకా షెడ్యూల్‌ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ల్యాండింగ్‌లో అన్ని దేశాల నుండి అంతర్జాతీయంగా వచ్చేవారిలో 2 శాతం యాదృచ్ఛిక నమూనాలు తీసుకోబడతాయి. సవరించిన మార్గదర్శకాలలో ప్రయాణికులు నమూనా ఇవ్వవచ్చు. 7 రోజుల హోమ్ క్వారంటైన్ వంటి ఆదేశాలు కూడా రద్దు చేశారు. కాకుంటే  ఇండియాకు వచ్చిన తర్వాత 14 రోజుల హోమ్​ క్వారంటేన్​ వంటివి తప్పకుండా పాటించేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కాగా, Omicron వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తగ్గుతున్న నేపథ్యంలో సవరించిన అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకాలు వెలువరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement