అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సవరించిన కొవిడ్ -19 మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది ఫిబ్రవరి 14 నుండి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. కాగా, దీనిలో విదేశీ ప్రయాణికులకు పెద్ద ఊరట లభించిందనే చెప్పవచ్చు. ‘రిస్క్ కంట్రీస్’.. ఇతర వర్గీకరణల వంటి దేశాల విభజనను ఈసారి తొలిగించారు. దీని ప్రకారం పోర్ట్ ఆఫ్ అరైవల్‌లో నమూనాలను అందించడం, ‘రిస్క్ లో ఉన్న’ దేశాల నుండి ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే.. RT-PCR టెస్ట్ రిపోర్టు తప్పకుండా ఉండాలి. (ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్నది) ప్రయాణికులు ప్రైమరీ టీకా షెడ్యూల్ సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ల్యాండింగ్‌లో అన్ని దేశాల నుండి అంతర్జాతీయంగా వచ్చేవారిలో 2 శాతం యాదృచ్ఛిక నమూనాలు తీసుకోబడతాయి. సవరించిన మార్గదర్శకాలలో ప్రయాణికులు నమూనా ఇవ్వవచ్చు. 7 రోజుల హోమ్ క్వారంటైన్ వంటి ఆదేశాలు కూడా రద్దు చేశారు. కాకుంటే ఇండియాకు వచ్చిన తర్వాత 14 రోజుల హోమ్ క్వారంటేన్ వంటివి తప్పకుండా పాటించేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కాగా, Omicron వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తగ్గుతున్న నేపథ్యంలో సవరించిన అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకాలు వెలువరించారు.