దేశవ్యాప్తంగా ఈరోజు, రేపు బ్యాంకులు సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 70 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతోపాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొనన్నారు. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నష్టాల పేరు చెప్పి కేంద్రమే బ్యాంకులను మూసివేయాలని చూస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు సమ్మెకు చేపట్టారు.