Tuesday, November 26, 2024

వచ్చేనెల నుంచి ప్రజాదర్బార్‌: నాకు ఈగో లేదు, నేను స్ట్రాంగ్‌ పర్సన్‌ను ఎవరికీ లొంగను: గవర్నర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్భార్‌ నిర్వహించి ప్రజలను కలుస్తానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రకటించారు. రాజ్‌భవన్‌ తెలంగాణ ప్రజల మేలు కోసమే ఉందన్నారు. తెలుగు నూతన సంవత్సరం శ్రీశుభకృత్‌నామ ఉగాది పర్వదిన వేడుకలు ఒక రోజు ముందే శుక్రవారం రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్‌ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. అయితే ఆ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించనని స్పష్టం చేశారు. పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఆప్యాయంగా ఉండాలన్నారు. ఫ్రెండ్లీ గవర్నర్‌ రాజ్‌భవన్‌లో ఉన్నారని, తనకు ఎలాంటి ఈగో లేదని చెప్పారు. అందరితో సఖ్యతతో ఉండటమే తనకు తెలుసునన్నారు. తాను స్ట్రాంగ్‌ పర్సన్‌ను అని… ఎవరికీ లోంగను అని స్పష్టం చేశారు. గవర్నర్‌ హోదాలో రాజ్‌భవన్‌ పరిమితులు తనకు తెలుసుననన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని స్పష్టం చేశారు. ఉత్ప్రేరకంగా పనిచేస్తానని చెప్పారు.

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు..

తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశుభకృత్‌నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, ఆ వెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలన్నారు.

రాజ్‌భవన్‌ ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌, మంత్రులు దూరం…

రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు గైర్హాజరయ్యారు. ఉగాది ఉత్సవాలకు రవాలని సీఎం కేసీఆర్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. ఉగాది ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ప్రగతి భవన్‌కు ఆహ్వానం పంపారు.
మరోవైపు రాజ్‌భవన్‌లో ఉగాది ప్లెnక్సీలపై సీఎం కేసీఆర్‌ ఫోటో ఎక్కడా కనిపించలేదు. అయితే కాంగ్రెస్‌, బీజేపీ నేతలతో కోలాహలంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. పోలీస్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్దగా హాజరుకాలేదు. దీంతో రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య గ్యాప్‌ మరింత పెరిగిందని పలువురు భావిస్తున్నారు.

- Advertisement -

రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ప ద్మ అవార్డు గ్రహిత కిన్నెర మొలిలయ్య, తదితరులు హాజరయ్యారు.

గవర్నర్‌ను కలిసిన రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌..

రెడ్‌ క్రాస్‌ సొసైటీ తెలంగాణ శాఖ చైర్మన్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ మిశ్రా, వివిధ జిల్లాల రెడ్‌ క్రాస్‌ చైర్మన్లు, రాష్ట్ర పాలక వర్గ సభ్యులు శుక్రవారం రాజభవన్‌ లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను మర్యాద పూర్వకంగా కలిశాిరు. రెడ్‌ క్రాస్‌ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్బంగా గవర్నర్‌ మాట్లాడుతూ…సమర్థంగా సేవలు అందచేశారని ప్రశంసించారు. ఇక ముందు కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాలని తెలిపారు. అదేవిధంగా జనరిక్‌ షాపులను పేద ప్రజల కొరకు అందుబాటులో ఉంచాలని కోరారు. జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ ను బలోపేతం చేయాలన్నారు. వరంగల్‌, #హనుమకొండలో మాదిరిగా తలసీమియా పిల్లలను గుర్తించాలని అన్నారు, వారి కోసం రక్తదాన శిబిరాలు నిర్వ#హంచాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement