Saturday, November 23, 2024

Flash: నేను ఫ్రెండ్లీ గవర్నర్ ని.. వివాదాస్పద వ్యక్తిని కాను: తమిళసై

తాను వివాదాస్పద వ్యక్తిని కానని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు. బుధవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యి.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసన్నారు. ప్రధానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగాన్ని, రాజభవన్ ను గౌరవించాలని తెలిపారు. తెలంగాణలో తాను అధికారం చెలాయించడం లేదన్నారు. తాను ఫ్రెండ్లీ గవర్నర్ ని అని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వంతో గ్యాప్ ఏర్పడిందన్న వ్యాఖ్యలపై ఆమె ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించానని తెలిపారు. ఆయన అర్హతలు సరిపోలేదని, అందుకే తిరస్కరించానని తెలిపారు. అందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. గవర్నర్ కు గౌవరం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం కావాలనుకుంటే ఎప్పడైనా తన ఆఫీస్ కు రావొచ్చని తెలిపారు. గవర్నర్ కు గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రోటోకాల్ తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. తాను రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటానని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement