వరంగల్, ప్రభ న్యూస్ ప్రతినిధి: దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్నిచాటేరీతిలో హనుమకొండ నగరం లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఆజ్ కి అమృత్సవ్ లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానములో నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. గవర్నర్ ఉత్సవాలను ప్రారంభించి కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు.
సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్.. ఆకట్టుకున్న జానపద నృత్యాలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement