Monday, November 18, 2024

Breaking: కేబుల్​ బ్రిడ్జి ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న మంత్రి

గుజరాత్​లో ఆదివారం కేబుల్​ బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రస్తుతానికి 35 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో 100 మంది దాకా నీటమునిగి గల్లంతైనట్టు సమాచారం. ఈ ప్రమాదంపై గుజరాత్​ ప్రభుత్వం స్పందించింది. దీనికి గుజరాత్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని రాష్ట్ర మంత్రి బ్రిజేష్​ మోర్జా తెలిపారు. ఈరోజు సాయంత్రం కేబుల్​ బ్రిడ్జి కూలిపోవడంతో దాదాపు 500 మంది దాకా నదిలో పడిపోయారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, స్థానిక పోలీసుల సహాయంతో 400 మంది దాకా రెస్క్యూ చేశారు.

గత వారం వంతెన రిపేర్లు పూర్తయ్యాయి. ఇట్లా ఎందుకు జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నాం అని రాష్ట్ర, కార్మిక, ఉపాధి మంత్రి బ్రిజేష్ మెర్జా అన్నారు. చారిత్రాత్మకమైన వంతెన పునరుద్ధరణ కోసం నెలల తరబడి క్లోజ్​ చేసే ఉంచామని, నాలుగు రోజుల క్రితమే ప్రజల సందర్శన కోసం ఓపెన్​ చేసినట్టు చెప్పారు.

కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹ 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​తో పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు గుజరాత్​ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 4 లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement