Thursday, September 19, 2024

చైల్డ్​ మ్యారేజెస్​లో జార్ఖండ్​ టాప్​​.. 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు!

చట్ట ప్రకారం చైల్డ్​ మ్యారేజెస్​ నేరం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఆచారంగా వస్తోంది. అంతేకాకుండా ఆర్ధిక కారణాలు కూడా తమ పిల్లలకు త్వరగా పెళ్లి చేసేందుకు కారణమవుతున్నాయి. అయితే.. ఇట్లాంటి దురాచారాలను పారదోలేందుకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ నేతృత్వంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఈ దురాచారం కొనసాగుతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన జనాభా సర్వేలో జార్ఖండ్‌ రాష్ట్రంలో అత్యధిక శాతం తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ద్వారా 2020లో ఈ సర్వే నిర్వహించారు. దాని నివేదిక గత సెప్టెంబర్‌లో ప్రచురితమయ్యింది. జార్ఖండ్‌లో 18 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకునే అమ్మాయిల శాతం 5.8 శాతంగా ఉందని ఈ సర్వేలో వెల్లడయ్యింది.

18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్న ఆడవారి శాతం జాతీయ స్థాయిలో 1.9గా ఉంది. కేరళలో మాత్రం ఇది సున్నాగా నమోదైంది. జార్ఖండ్‌లో 5.8 వరకు ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3 శాతం ఉన్నాయి. సర్వే ప్రకారం.. దేశంలో సగానికి పైగా మహిళలు 21 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకుంటున్న రాష్ట్రాల్లో రెండే రెండు ఉన్నాయి. వాటిలో  ఒకటి జార్ఖండ్ కాగా, రెండోది పశ్చిమ బెంగాల్ అని తేలింది. పశ్చిమ బెంగాల్‌లో 54.9 శాతం మంది బాలికలకు 21 ఏళ్లు నిండకముందే వివాహాలు జరుగుతున్నాయి. ఇక.. జాతీయ సగటు 29.5 శాతం ఉండగా.. జార్ఖండ్‌లో ఈ సంఖ్య 54.6 శాతంగా ఉందని సర్వే పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement