దేశంలో మూడో అతి పెద్ద టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (Vodafone Idea) నుంచి కీలక ప్రకటన వచ్చింది. కంపెనీలోని (Company) మేజర్ వాటాను (Major share) ప్రభుత్వానికి (Government) అప్పగించినట్లు అఫిషీయల్ అనౌన్స్ మెంట్ చేసింది కంపెనీ. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చాక వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం (35.8 per cent) వాటా గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్లింది. వ్యవస్థాపకులతో పాటు కంపెనీ ప్రస్తుత షేర్ హోల్డర్లందరిపై ఇది ప్రభావం చూపనుంది. కాగా వినియోగదారులను భారీగా కోల్పోతుండడం, అలాగే పెద్దగా లాభదాయక పరిస్థితులు కనిపించకపోవడం వల్ల ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ పేర్కొంటోంది.
స్టాక్ ఎక్స్ఛేంజ్ (Stock exchange) ఫైలింగ్‌లో ఈ వివరాలన్నింటినీ వొడాఫోన్ ఐడియా తెలిపింది. తాజాగా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది. యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి 28.5 శాతం వాటా ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా (Aditya Birla) గ్రూప్‌నకు 17.8 శాతం వాటా ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం (Government of India) 35.8 శాతం వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుంది. మొత్తానికి ప్రభుత్వ ఆధీనంలోకి వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) వెళ్లి పోయింది. ఇక ఈ పరిణామం తర్వాత తాజా స్టాక్ సూచీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లు దారుణంగా పడిపోయాయి.