Wednesday, November 20, 2024

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ మూసివేత‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిన్న ఒక్క రోజు మధ్యప్రదేశ్ లో కొత్తగా 4,031 కరోనా కేసులు వచ్చాయి. ముగ్గురు మరణించారు. పాజిటివిటీ రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ స్కూళ్ల‌ను 1నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాగా రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన కార్యక్రమాలు, ఇతర వేడుకలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. మకర సంక్రాంతి స్నానాలపై నిషేధం లేదని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement