భారత్‌లో పాలక పార్టీ నేత మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘనిస్ధాన్ తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ వ్యాఖ్యలను ఇప్పటివరకూ ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ, జోర్డాన్, ఆప్ఘనిస్ధాన్, పాకిస్తాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా సహా 14 దేశాలు ఖండించాయి. తాజాగా మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వం స్పందించింది. నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ మతోన్మాదంపై భారత్‌కు ఆప్ఘన్ పాఠాలు బోధించింది. ఇస్లాంను అవమానించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా ఉన్మాద చర్యలను భారత్ అనుమతించరాదని తాము కోరుతున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజహిద్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తపై భారత బీజేపీ నేత వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని నూతనంగా ఎన్నికైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌లో మతసామరస్యం దెబ్బతింటోందని, ముస్లింలను అణిచివేస్తున్నారని, ప్రపంచ దేశాలు ఈ పరిణామలను గమనించానలి అన్నారు. మరోవైపు పాకిస్తాన్ సహా ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement