గురువారం సికింద్రాబాద్ లోని మినిస్టర్ రోడ్డులో ఉన్న భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన భవనంలో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది.ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగడంతో.. రాత్రి 9.30 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయితే మాల్ సిబ్బంది ముగ్గురు భవనంలో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ అధికారులు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. బిల్డింగ్ ను పరిశీలించిన అనంతరం జీహెచ్ఎంసీ టెక్నికల్ విభాగం నివేదికను సమర్పించనున్నారు.నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement