Tuesday, November 26, 2024

ఎకోఫ్రెండ్లీ విగ్ర‌హాల‌కు ప్ర‌భుత్వ ప్రోత్స‌హం..

రాష్ట్రంలోని వివిధ రకాల చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఎన్నో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పర్యావరణానికి హానీ కలగకుండా ఉండాలని మట్టి గణపతుల విగ్రహాల తయారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా బీసీ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో 200 మందికి ఈ నెల 13 నుంచి హన్మకొండలో శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పోరేషన్‌ ఎండీ. కె.అలోక్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్రా వెంకటేశ్‌ ప్రోత్సాహంతో గతంలోనే 50 మంది కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికి శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

వారందరూ ఏకోఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి ఆర్థికంగా లబ్ది పొందారని చెప్పారు. ఈ నెల 13 నుంచి నిర్వహించే వర్క్‌షాప్‌లో 2 వందల మందికి దశలవారిగా శిక్షణ ఇస్తామని, ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి శిక్షణ ఉంటుందన్నారు. ఐదు అడుగులు, అంతకు మంచి ఎత్తులో మట్టి విగ్రహాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించే విధంగా శిక్షణ ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement