Thursday, November 21, 2024

Breaking: సిమ్ కార్డ్స్ రూల్స్ మారుతున్నయ్.. విదేశాల్లో ఇక రోమింగ్ ఇష్యూస్ ఉండవ్..

కస్టమర్ ప్రొటెక్షన్ మరింత బెటర్ మెంట్ చేసేందకు అంతర్జాతీయ రోమింగ్ సిమ్ కార్డ్ ల విక్రయంపై ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని.. ఇప్పటిదాకా ఉన్న రూల్స్ ని సవరించినట్టు టెలికాం శాఖ అధికారిక ప్రకటన తెలిపింది. విదేశాలను సందర్శించే భారతీయులకు ప్రయోజనం చేకూర్చడానికే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇతర లైసెన్సులకు అనుగుణంగా విధి విధానాలను క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపింది.

కస్టమర్ కేర్ సర్వీస్, సంప్రదింపు వివరాలు, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్, ఐటమైజ్డ్ బిల్లులు, టారిఫ్ ప్లాన్‌లకు సంబంధించిన సమాచారం మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఇకపై ఎటువంటి NOC సర్టిఫెకెట్ అవసరం ఉండదని టెలికాం శాఖ తెలిపింది. ఇది సవరించిన విధానం ద్వారా తెలియజేస్తున్నట్టు పేర్కొంది. అదేవిధంగా బిల్లింగ్, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించచే చర్యలను మరింత స్పీడప్ చేయనున్నట్టు తెలుస్తోంది.

DoTలో అప్పీలేట్ అథారిటీకి సంబంధించిన నిబంధనతో NOC హోల్డర్ల ద్వారా ఫిర్యాదులను టైమ్ బేస్డ్ గా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు అధికారిక ప్రకటన పేర్కొంది. దేశంలో విదేశీ ఆపరేటర్ల అంతర్జాతీయ రోమింగ్ సిమ్ కార్డ్ లు, గ్లోబల్ కాలింగ్ కార్డ్ ల విక్రయాలపై కూడా సవరించిన నిబంధనలు వర్తించనున్నాయి. కాగా, TRAI యొక్క స్వయంప్రతిపత్తి సిఫార్సులపై చర్చించిన తర్వాత సవరించిన నిబంధనలు, షరతులను డిపార్ట్ మెంట్ ఖరారు చేసిందని ఆ నోట్ లో టెలికాం పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement