వరుసగా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ కి బెదిరింపు మెయిల్ వస్తున్నాయి. రీసెంట్ గా మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. కాగా ఈ మెయిల్ లో గంభీర్ ఇంటి వీడియోను కూడా పంపారు అగంతకులు..ఈ మెయిల్ లో నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్ అని మెయిల్లో బెదిరించారు. దీంతో ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
అయితే ఈ ఈమెయిళ్లపై విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు బెదిరింపు మెయిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయో కనిపెట్టారు. అయితే ఇందులో ఒకటి ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రాగా, మరొకటి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కరాచీలోని సింధ్ యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసుల ద్వారా తెలిసింది. షాహీద్ హమీద్ అనే యువకుడు.. గంభీర్‌కు మెయిల్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు వారిపై చర్య తీసుకోనున్నారు.