Monday, November 25, 2024

గౌరవెల్లి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ట్ర‌యిల్ ర‌న్ స‌క్సెస్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాగునీటిరంగంలో తెలంగాణ అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన అనంతరం తాగు, సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వేలాది కోట్ల రూపాయలతో పనులు ప్రారం భించిన సాగునీటి ప్రాజెక్టులు ప్రజలకు అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో అనేక ప్రాజెక్టులు ట్రైయల్‌ రన్‌ కోసం సిద్ధంకాగా సిద్ధిపేటలోని గౌరవెల్లి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గత రెండు రోజుల నుంచి మూడు
బాహుబలి మోటర్లతో నిర్వహిస్తున్న ట్రైయల్‌ రన్‌ విజయవంతం కావడంతో ఈ ప్రాజెక్టు ద్వారా లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. సిద్ధిపేట జిల్లాలోని అక్కన్న పేట మండలంలోని గౌరవెల్లిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు అక్కన్న పేట, హుస్నాబాద్‌ మండలంలో 15 వేలు, కొహెడ లో 8వెెలు భీమదేవరపల్లిలో 13వేలు, ఘన్‌ పూర్‌లో 10వేలు, సైదా పూర్‌ లో 3వేలు, హన్మకొండలో,జాఫర్‌ఘడ్‌, రఘునాథపల్లి మండలాల్లోని ఐదుగ్రామాలకు కుడి కాలువద్వారా 90వేలు, ఎడమకాలువద్వారా 16వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌ మానేరు మీదుగా గోదావరి జలాలు బెజ్జంకి మండలంలో నిర్మించిన రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి 11 కిలో మీటర్లు ప్రయాణించి 16 కిలోమీటర్ల టన్నెల్‌ ల్లో ప్రయాణిస్తాయి. ఈ టన్నెల్‌ ద్వారా కాళేశ్వరం జలాలు ప్రయాణించి రేగొండ వద్ద నిర్మించిన 130మీటర్ల లోతులోని సర్జిపూల్‌ చేరుకుంటాయి. ఈ సర్జీపూల్‌ నుంచి మూడు భారీ బాహుబలి మోటర్ల ద్వారా గౌరవెల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తాయి. ఒక్కో మోటర్‌ 2వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. అనంతరంప్రాజెక్టునుంచి కాలువల ద్వారా చెరువులను నింపుతూ లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రక్రియ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా ఆవిష్కరించి పంటపొలాలను సస్యశ్యామలం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement