Friday, November 22, 2024

ఓటు వేసిన ‘యోగి ఆదిత్య‌నాథ్’

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఆరోద‌శ పోలింగ్ ప్రారంభ‌మైంది. యూపీలోని 10జిల్లాల్లోని 57నియోజ‌క‌వ‌ర్గాల్లో 6వ ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మ‌యింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాల గోరఖ్‌నాథ్ కన్యానగర్ లో త‌న ఓటును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్‌కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య వంటి భారీ నాయకుల భవితవ్యాన్ని ఓట‌ర్లు నిర్ణ‌యించ‌నున్నారు. కీల‌క‌మైన అంబేద్కర్‌నగర్, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బల్లియా జిల్లాల్లో ఆరో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. మొత్తం 57 స్థానాల కోసం 676 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మొద‌టిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల‌ బ‌రిలో నిలిచిన గోరఖ్‌పూర్ అర్బన్ నియోగ‌జ‌క‌వ‌ర్గానికి కూడా నేడు ఓటింగ్ జ‌రుగుతోంది. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ తమ్‌కుహి రాజ్ స్థానం బ‌రిలోకి దిగ‌గా, ఇటీవ‌లే మంత్రిప‌ద‌వికి రాజీనామా చేసి.. బీజేపీ గుడ్‌బై చెప్పి స‌మాజ్ వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి బ‌రిలోకి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement